శాంతి భద్రతల పరిరక్షణ సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అన్నారు మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి. ఐపిఎస్., డిఐజీ. ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ సుదీర్ రాంనాథ్ కేకన్ల ఉత్తర్వుల మేరకు మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి పర్యవేక్షణలో మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బందితో కలిసి అండలమ్మా కాలనీ ప్రాంతంలో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమంను నిర్వహించి ఇళ్లలో సోదాలు, వాహన తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 45 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ… నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించామని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, ఈ కార్యక్రమం నిర్వహించారు. మీ కాలనీలలో ప్రజలందరి భాగస్వామ్యంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సీసీ కెమెరాలు ఉన్నచోట ఎలాంటి నేరం చేయడానికి అయినా భయపడతారని, సీసీ కెమెరాలు 24 గంటలు నిరంతరం రక్షణగా ఉంటాయని తెలిపారు. నేరా నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని కావున ప్రజలందరూ సహకరించి సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.
ప్రతిదీ సీసీ కెమెరాలో నిక్షిప్తమై ఉండడం వలన ఏదైనా నేరం జరిగినప్పుడు నిజా నిజాలను గుర్తించడానికి, నిందితులను గుర్తించడం సులభం అవుతుందని అన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇల్లు అద్దెకొరకు మీ దగ్గరకు వస్తే వారి పూర్తి వివరాలు అడిగి వారి వద్ద నుండి ఆధార్ కార్డ్ తీసుకోవాలి ఏమైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజల రక్షణ, ప్రజలకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు అనే భరోసా నమ్మకం కలిగించే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీస్ లేదా డయల్ 100 కు గాని స్థానిక పోలీస్ అధికారులకు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి తిరుపతిరెడ్డి, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ రాజు, ఎస్ఐ రాజేందర్, జగదీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.