Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుMali Tiktok Star Murder : మాలిలో ఉగ్రదాడి! టిక్‌టాక్ స్టార్‌ దారుణ హత్య

Mali Tiktok Star Murder : మాలిలో ఉగ్రదాడి! టిక్‌టాక్ స్టార్‌ దారుణ హత్య

Mariam Cisse Tiktok Star Murder : పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో జిహాదీ ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. టిక్‌టాక్‌లో 90 వేల మంది ఫాలోవర్లతో పాప్యులరైన 19 ఏళ్ల మరియం సిస్సేను కిడ్నాప్ చేసి, బహిరంగంగా కాల్చి చంపారు. మాలి సైన్యానికి తమ కదలికలపై వీడియోలు తీసి సమాచారం చేరవేస్తోందని ఆరోపించి ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ALSO READ: Vizag: ఏపీ ప్రభుత్వంతో ఫార్మా కంపెనీ భారీ డీల్

ఉత్తర మాలిలోని టోంకా నగరం దారుణం చోటుచేసుకుంది. ఈ నగరానికి చెందిన మరియం సిస్సే స్థానిక జీవితం, సంస్కృతి, రోజువారీ సంఘటనలపై వీడియోలు పోస్ట్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె వీడియోలు సరళంగా, ఆకర్షణీయంగా ఉండటంతో తక్కువ సమయంలోనే 90 వేల మంది ఫాలోవర్స్ ను చేరింది. ఈ నేపథ్యంలో కొందరు జిహాదీలు ఆమెను టార్గెట్ చేశారు. అల్-ఖైదాతో సంబంధాలున్న జేఎన్‌ఐఎం (జామాఅత్ నస్రుల్ ఇస్లామ్ వల్-ముస్లిమీన్) ఉగ్రవాద సంస్థ ఇటీవల మాలిలో ఇంధన దిగ్బంధనం విధించి, పలు ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేయించింది. పంటల కోతలు కూడా నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో ఆమెను అపహరించి ఒక మోటార్‌బైక్‌పై టోంకా ఇండిపెండెన్స్ స్క్వేర్‌కు తీసుకువచ్చారు. అక్కడి జనసమూహం చూస్తుండగానే తుపాకీతో కాల్చి చంపారు. ఈ దారుణం ఆమె సోదరుడి ఎదురుగానే జరిగింది. “వారు నా సోదరిని చంపేటప్పుడు నేను ఆ గుంపులోనే ఉన్నాను” అంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానిక భద్రతా అధికారి, “సైన్యం కోసం వీడియోలు తీస్తోందని ఆరోపించి బహిరంగంగా హత్య చేశారు. ఇది అత్యంత అనాగరికమైన చర్య” అని తెలిపారు. మాలి ప్రభుత్వం ఈ హత్యను “నీచమైన చర్య”గా ఖండించి, దర్యాప్తు ప్రారంభించింది. స్థానికులు, మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

మాలి 2012 నుంచి జిహాదీ ఉగ్రవాదంతో పోరాడుతోంది. అల్-ఖైదా, ఐఎస్‌లతో సంబంధాలున్న సంస్థలు ఉత్తర, మధ్య ప్రాంతాల్లో తిరుగుబాటు చేస్తున్నాయి. 2020లో సైనిక కూడ్ టాట్ తర్వాత ప్రభుత్వం ఫ్రెంచ్ సైన్యాన్ని గెటౌట్ చేసింది. ఇప్పుడు రష్యా మెర్సినరీలు (వాగ్నర్ గ్రూప్) సహాయం తీసుకుంటోంది. కానీ, ఉగ్రవాదులు ఇంధన దిగ్బంధనాలు, హత్యలు, అపహరణలు చేస్తున్నారు. మరియంలా వంటి యువతను సైతం టార్గెట్ చేయడం మాలి సోషల్ మీడియా యువతను భయపెడుతోంది. అమెరికా, ఐరోపా మానవ హక్కుల సంస్థలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. మాలి ప్రభుత్వం భద్రతా చర్యలు పెంచాలని డిమాండ్ చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad