Married woman suicide: కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలు సైతం భారీ గొడవలకు దారి తీస్తాయి. క్షణికావేశంలో దారుణాలకు పాల్పడేలా చేస్తాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో ఇలాంటి అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. కూర ఎందుకు వండలేదని భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కూర ఎందుకు వండలేదని భర్త మందలించినందుకు.. రామాజీపేట గ్రామానికి చెందిన దొడిమెల్లి మనోజ(27) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భూపతిపూర్ గ్రామానికి చెందిన మనోజకు తొమ్మిదేళ్ల క్రితం రామాజిపేటకు చెందిన సుధాకర్‌తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దీంతో వారి జీవితం అన్యోన్యంగా సాగుతోంది. కానీ ఇంతలో చిన్న తగాదా.. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.
Also Read: https://teluguprabha.net/crime-news/father-raped-daughter-in-prakasam-district/
అసలేం జరిగిందంటే: శనివారం రాత్రి సుధాకర్ మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తీసుకొచ్చేసరికి మనోజ కూర వండలేదు. పిల్లలు కారంతో అన్నం తింటున్నారు. అది గమనించిన సుధాకర్ .. ఎందుకు కూర వండలేదని భార్యను మందలించాడు. ఆ తర్వాత తానే వంట చేసేందుకని వంటింట్లోకి వెళ్లాడు. భర్త మందలింపుతో మనోజ తీవ్ర మనస్తాపం చేందింది. వెంటనే బెడ్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. వంట చేసి హాల్‌లోకి వచ్చిన సుధాకర్.. తన భర్య కనిపించలేదని కంగారు పడ్డాడు. వెంటనే బెడ్రూంకు వచ్చి చూశాడు. దీంతో ఒక్కసారిగా సుధాకర్ కంగు తిన్నాడు. తన భార్య ఉరేసుకుందని.. కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు వెంటనే స్పందించారు. మనోజ తల్లి వెంకటి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్టుగా ఎస్సై సుధీర్‌రావు తెలిపారు.


