Tuesday, December 3, 2024
Homeనేరాలు-ఘోరాలుAramghar | ఆరంఘర్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం

Aramghar | ఆరంఘర్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ ఆరంఘర్ చౌరస్తా (Aramghar Chowrasta) లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం ఓ స్క్రాప్ గోడౌన్‌ లో చెలరేగడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Also Read : బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ కుట్ర

మంటల ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించింది. దీంతో చుట్టుపక్కల ప్రజలంతా ఊపిరి పీల్చుకోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. గోడౌన్ అగ్ని ప్రమాదంలో కోట్ల రూపాయాల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చని ప్రాధమిక అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో ఆరంఘర్ (Aramghar) లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కాగా, ఘటనపై ఆరంఘర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి అసలు కారణం ఏమై ఉంటుందో అని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News