Sunday, November 16, 2025
HomeAP జిల్లా వార్తలుఅమరావతిCrime : వామ్మో.. ఘరానా మోసం! రూ.70 లక్షలు, బంగారం మాయం

Crime : వామ్మో.. ఘరానా మోసం! రూ.70 లక్షలు, బంగారం మాయం

Crime : మోసం.. మోసం.. మోసం.. ఎక్కడ చూసినా ఇదే! సైబర్ మోసాలే కాకుండా, నేరుగా ప్రలోభ పెట్టి మరీ లక్షలు గుంజేస్తున్నారు. కళ్లు మూసి తెరిచేలోగా దోచేస్తున్నారు. లక్షలు, కోట్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు పలు చోట్ల చోటుచేసుకోగా.. తాజాగా మరో భారీ మోసం బయటపడింది.

- Advertisement -

ఈడీ (ED) అధికారులమంటూ నమ్మించి ఓ వ్యాపారిని ముంచేశారు దుండగులు. విజయవాడకు చెందిన బంగారం వ్యాపారి జగదీష్‌ను లక్ష్యంగా చేసుకుని దాదాపు రూ.70 లక్షల నగదు, 100 గ్రాముల ముడి బంగారాన్ని దోచేశారు. ఈ సంఘటన మేడికొండూరు శివారులో చోటుచేసుకుంది.

ALSO READ : Crime : వామ్మో.. ఘరానా మోసం! రూ.70 లక్షలు, బంగారం &

వివరాల ప్రకారం, జగదీష్ ఇటీవల శ్రీస్వామి సమర్థ గోల్డ్ అండ్ సిల్వర్ టెస్టింగ్ అనే దుకాణం ప్రారంభించాడు. అతడి ముందు వ్యాపారి భాగస్వామి రంజిత్ మారుతీ పేట్ అనే వ్యక్తి మళ్లీ అతడిని సంప్రదిస్తూ తక్కువ ధరకు ముడి బంగారం అందిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలోనే జగదీష్, అతని స్నేహితుడు ప్రవీణ్‌తో కలిసి రెండు కిలోల బంగారం కొనుగోలు చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ముందుగా రూ.70 లక్షలు చెల్లించి, నాణ్యత పరీక్ష కోసం బంగారాన్ని తిరిగి తీసుకెళ్తుండగా.. మేడికొండూరులో కారును నలుగురు అనుమానితులు అడ్డుకున్నారు. వారిలో ఇద్దరు పోలీసు వేషధారణలో ఉన్నారు.

తామంతా Enforcement Directorate (ED) అధికారులమని నమ్మించి, డబ్బు బంగారం తీసుకుని పరారయ్యారు. జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోసానికి పాల్పడినవారు మహారాష్ట్రకు చెందినవారై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రంజిత్ మారుతీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలుస్తుంది.

ఇక ఇలాంటి మోసాల పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతుండటంతో అనుమానితులను నమ్మెద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ : Lisa Ray : బ్లడ్ క్యాన్సర్.. డాక్టర్లు ఐదేళ్లు కూడా కష్టమే అన్నారు.. కానీ 16 ఏళ్లుగా!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad