Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుCrime News : మరో దారుణం.. భార్యను ముక్కలు చేసి మూసీలో పడేశాడు!

Crime News : మరో దారుణం.. భార్యను ముక్కలు చేసి మూసీలో పడేశాడు!

Crime : హైదరాబాద్‌లోని మీర్‌పేటలో జనవరిలో జరిగిన దారుణ హత్య ఇంకా మరువకముందే, మేడిపల్లిలో మరో కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డి (25) తన భార్య స్వాతిని (25) కిరాతకంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసి మూసీ నదిలో పడేశాడు. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్‌లో జరిగింది. మల్కాజిగిరి డీసీపీ పద్మజ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

- Advertisement -

ALSO READ: Konaseema: అన్నంలో గ్లాసు ముక్కలు, కుళ్లిన కూరలు.. హాస్టల్ విద్యార్థుల ఆందోళన కోనసీమలో దారుణం

మహేందర్, స్వాతి ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్‌లో నివసిస్తున్నారు. కులాంతర వివాహం కారణంగా ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు, గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ నెల 23న మహేందర్ పథకం ప్రకారం స్వాతిని కొట్టి, అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత హాక్సా బ్లేడ్‌తో ఆమె తల, కాళ్లు, చేతులు వేరు చేశాడు. రాత్రి పెట్రోలింగ్ సమయంలో మూడు సార్లు మూసీ నది వద్దకు వెళ్లి శరీర భాగాలను కవర్లలో విసిరేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు మరదలు చంద్రకళకు స్వాతి కనిపించడం లేదని చెప్పి, మిస్సింగ్ నాటకమాడాడు. చంద్రకళ ఈ విషయాన్ని తన మేనమామ గోవర్ధన్ రెడ్డికి చెప్పడంతో, ఇద్దరూ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మేడిపల్లి పోలీసులు ప్రశ్నించగా, మహేందర్ నేరాన్ని అంగీకరించాడు.

పోలీసులు ఫోరెన్సిక్, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించగా, ఇంట్లో స్వాతి మొండెం మాత్రమే లభించింది. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, ఎస్‌డీఆర్‌ఎఫ్ సహాయంతో మూసీలో శరీర భాగాల కోసం గాలిస్తున్నప్పటికీ ఇప్పటివరకు లభించలేదు. ఈ హత్య క్షణికావేశంలో జరగలేదని, గతంలో నాలుగు సార్లు గొడవలు, కౌన్సెలింగ్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మీర్‌పేటలో గురుమూర్తి హత్యను గుర్తుచేస్తోంది, అక్కడ ఆయన తన భార్యను చంపి, ముక్కలు చేసి, ఉడికించి చెరువులో పడేశాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad