Homeనేరాలు-ఘోరాలుMeerpet: మీర్ పేట్ లో దారుణం... జంట హత్యల కలకలం

Meerpet: మీర్ పేట్ లో దారుణం… జంట హత్యల కలకలం

కుటుంబ కలహాలతో ఇద్దరి దారుణ హత్య, మరొకరికి తీవ్ర గాయాలు

- Advertisement -

అత్త, బావమరిది భార్యను కత్తితో నరికి చంపిన అల్లుడు

బావమరిదిపై కూడా కత్తితో దాడి

మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

బడంగ్ పేట్, ( తెలుగు ప్రభ ) :మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి విహార్ కాలనీలో బుధవారం సాయంత్రం జంట హత్యల ఘటన తీవ్ర కలకలం లేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తరచు తనను టార్చెర్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసిన భార్యతో పాటు తనను లైంగికంగా హింసిస్తున్నాడని ఫిర్యాదు చేసిన వరుసకు చెల్లెలు అయ్యే బావమరిది భార్యపై కక్ష్య పెంచుకున్నాడు. అత్తింటికి వెళ్లి అత్త తో పాటు బావ మరిది భార్య పై అల్లుడు కత్తులతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో అత్త తో పాటు బావమరిది భార్య తీవ్ర గాయల పాలై అక్కడికక్కడే మృతి చెందగా, బావ మరిది మాత్రం చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసమయంలో ప్రాణ భయంతో మొదటి అంతస్థుకు వెళ్లిన అతని భార్య ప్రాణాలతో సురక్షితంగా బయటపడగలిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి… షరీఫ్ నగర్‌కు చెందిన షేక్ మహమ్మద్ సిద్ధిఖీ, అతని భార్య నూర్ బేగం మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. తన భర్తకు బావమరిది భార్య రేష్మా తో అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యతో తరచు విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భార్య , అత్త లు కలిసి రేష్మా తల్లి దండ్రులకు విషయం చెప్పడంతో వారిపై భర్త కక్ష్య పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో నూర్ బేగం భర్త షేక్ మహమ్మద్ సిద్ధిఖి పై మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె సాయి విహార్ కాలనీలోని తన పుట్టింటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న సిద్ధిఖీ సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో అత్తింటికి చేరుకొన్నాడు.

అత్త షేక్ నిరంజన్ బీ (50), బావమరిది యూసుఫ్, అతని భార్య రేష్మా (38), బావమరిది యూసుఫ్ లతో గొడవకు దిగాడు. వారి మధ్య మాట మాట పెరగడంతో కోపోద్రిక్తుడైన మహమ్మద్ సిద్ధిఖి కత్తితో మొదట బావమరది భార్య రేష్మాబేగం పై కత్తితో దాడి చేశాడు. అనంతరం అతని భార్య ప్రాణ భయంతో మొదటి అంతస్థుకు పారిపోయింది. అక్కడే ఉన్న అత్త షేక్ నిరంజన్ బీ, బావమరిది యూసుఫ్ లపై కూడా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయలపాలైన షేక్ నిరంజన్ బీ, రేష్మా మృతి చెందగా, యూసుఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేసిన అనంతరం మహ్మద్ సిద్దిఖి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న శంషాబాద్ డీసీపీ రాజేష్, ఆదిబట్ల డివిజన్ ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి , మీర్ పేట్ ఇన్స్పెక్టర్ శోభన్ లు, క్లూస్ టీంతో ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బావమరిది యూసుఫ్ ను చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు.

2 నెలలుగా శారీరకంగా హింసిస్తున్నాడని మహ్మద్ సిద్దిఖిపై పోలీసులకు ఫిర్యాదు …

ఇది ఇలా ఉండగా చిన్న ఆడపడుచు భర్త మహ్మద్ సిద్దిఖి గత రెండు నెలలుగా తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చంపేస్తానని బెదిరించి బలవంతంగా లైంగికంగా హింసించాడని, అతనితో ప్రాణ హాని ఉందంటూ రేష్మాబేగం కూడా మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ కేసును మీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:Vaira: బురద బాటలో బతుకులు.. సీసీ రోడ్డు కోసం కాలనీవాసుల ఎదురుచూపులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News