Mentally Challenged Mother Kills Her Two Children: ఉత్తరప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళ తన ఇద్దరు చిన్నారులను అతి కిరాతకంగా చంపేసి, ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం సాయంత్రం మీర్జాపూర్ జిల్లాలో జరిగింది.
ALSO READ: Breakup: మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి, యువకుడి ఆత్మహత్య.. ఆమె బ్రతికింది.. అతను చనిపోయాడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ దారుణం కచ్వా ప్రాంతంలోని సెమ్రి గ్రామంలో చోటుచేసుకుంది. హరీశ్చంద్ర భార్య సంగీత (35) శనివారం సాయంత్రం తన ఇద్దరు చిన్న పిల్లలైన శివాన్ష్ (3 సంవత్సరాల 8 నెలలు), శుభంకర్ (14 నెలలు) నోళ్లలో గుడ్డలు కుక్కి, ఆ తరువాత వారిని ఉరి వేసి చంపేసింది. అనంతరం అదే ఇంట్లో కొబ్బరి తాళ్లతో పైకప్పుకు ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
కచ్వా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అమర్జీత్ సింగ్ ఈ వివరాలు వెల్లడించారు.
కంటతడి పెట్టిన కుటుంబం
ఘటన జరిగిన సమయంలో సంగీత భర్త హరీశ్చంద్ర ఇంట్లో లేడు. బయటి నుంచి వచ్చిన తరువాత విషయం తెలుసుకుని కుప్పకూలిపోయాడు. కళ్ళెదుటే భార్య, ఇద్దరు పిల్లలు విగతజీవులై పడి ఉండటంతో అతను కన్నీరుమున్నీరుగా విలపించాడు.
ALSO READ: Man Slits Twin Daughters’ Throats: భార్యపై కోపం.. రెండేళ్ల కవల కుమార్తెల గొంతు కోసి చంపిన తండ్రి
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఆఫీసర్ (సదర్) అమర్ బహదూర్ మాట్లాడుతూ… సంగీత శనివారం ఉదయమే చందౌలి జిల్లాలోని తన పుట్టింటి నుంచి అత్తింటికి తిరిగి వచ్చిందని తెలిపారు.
సంగీత కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, కలకలాన్ని సృష్టించింది.
ALSO READ: Tribal Minors Gang Raped: ఒడిశాలో ‘జాతర’ చూసి వస్తుండగా ఇద్దరు మైనర్ గిరిజన బాలికలపై గ్యాంగ్ రేప్


