Minor girl suicide: దుబ్బాకలో తీవ్ర విషాదం నెలకొంది. రెండు పడకల గృహ సముదాయంలో 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక మరణం పట్ల.. ఆమె తల్లి తన రెండవ భర్తపై అనుమానం వ్యక్తం చేసింది.
రెండవ భర్తపై అనుమానం: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. రెండు పడకల గృహ సముదాయంలో ఉరివేసుకుని మరణించింది. అయితే ఈ ఘటనపై బాలిక తల్లి నిర్మల తన రెండవ భర్త అశోక్‌పై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అతడిపై నిర్మల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
Also read-karimnagar: అమానుష ఘటన.. ఆడపిల్లలను బావిలో పడేసిన కసాయి తండ్రి!
దుబ్బాకలో విషాదం: బాలిక మరణం పట్ల దుబ్బాకలో విషాదం నెలకొంది. చిన్న వయసులోనే బాలిక ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అందరితో కలిసి ఉండే బాలిక ఇలా అర్ధాంతరంగా మరణించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులను కోరారు.

