Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుAP crime: అన్నే కదా అని బైక్ ఎక్కిన బాలిక.. అంత పని చేశాడు ఆ...

AP crime: అన్నే కదా అని బైక్ ఎక్కిన బాలిక.. అంత పని చేశాడు ఆ నీచుడు!

Minor girl harassment: కలికాలం కన్నెర్ర చేస్తుంది. జంతువుల వలే… వావివరసలు మరిచి మైనర్ బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. అన్న వరుస అవుతానని మర్చిపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బండి పై ఎక్కించుకుని.. ఊరి చివర ఉన్న మామిడి తోటకు తీసుకెళ్లాడు.. అంత పని చేశాడు ఆ నీచుడు!

- Advertisement -

వరుసకు చెల్లి అయినా వదలని కామాంధుడు: అన్న వరుస అయిన వ్యక్తి మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఘటన చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలంలో చోటుచేసుకుంది. వరుసకు చెల్లెలు అయిన మైనర్ బాలికపై కన్నేసిన కామాంధుడు కటకటాల పాలయ్యాడు.

ఊరి చివర మామిడితోటకు తీసుకెళ్లి: బ్రాహ్మణపల్లికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. బ్రాహ్మణపల్లి నుంచి పాఠశాల వద్ద వదిలి పెడతానని బాలికను బైక్‌పై తీసుకెళ్లిన ప్రసాద్ అనే వ్యక్తి మృగంలా మారాడు. 40 ఏళ్ల కామాంధుడు.. బాలికకు అన్న వరుస అవుతానన్న విషయాన్ని మరిచాడు. మైనర్ బాలికను తల్లిదండ్రులు నమ్మకంతో ప్రసాద్‌తో పంపించగా.. విచక్షణ మరిచిన ప్రసాద్… ఊరి చివర మామిడితోట వద్దకు తీసుకెళ్లి వక్రబుద్ధిని ప్రదర్శించాడు. 11 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేశాడు.

Also Read: https://teluguprabha.net/crime-news/bits-pilani-goa-campus-student-death-fifth-incident-10-months/

ఎవరికైనా చెబితే చంపేస్తా: బాలికపై అత్యాచారానికి పాల్పడి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ప్రసాద్ బెదిరించారు. తిరిగి పాఠశాల వద్ద వదిలిపెట్టాడు. అయితే మైనర్ బాలిక తనపై జరిగిన లైంగిక దాడి ఘటనను ఏడుస్తూ ఉపాధ్యాయులకు చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని అందించారు. అనంతరం ఉపాధ్యాయులు వెదురు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మెుదలు పెట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad