Homeనేరాలు-ఘోరాలుCrime: తల్లి కోసం తండ్రిని చంపిన కొడుకు.. అసలేం జరిగిందంటే?

Crime: తల్లి కోసం తండ్రిని చంపిన కొడుకు.. అసలేం జరిగిందంటే?

Son killed father: మద్యం మత్తులో కన్నతల్లిని వేధిస్తున్నాడన్న ఆవేశం.. కన్నతండ్రిని కొడుకు హత్య చేశాడు. మైనర్ కుమారుడు కత్తితో దాడి చేయడంతో తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.

- Advertisement -

అసలేం జరిగిందంటే?: ఓబుల్‌రెడ్డి పేటకు చెందిన సదరు వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ తాగి వచ్చి ఇంటి వద్ద భార్యతో గొడవ పడేవాడు. అంతేకాకుండా ఆమెను శారీరకంగా వేధింపులకు పాల్పడ్డాడు. గత రాత్రి కూడా నిందితుడు మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యపై దాడికి దిగాడు. కళ్లముందే తండ్రి తల్లిని వేధిస్తుండటం చూసి తట్టుకోలేకపోయిన 16 ఏళ్ల కుమారుడు తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు.

Also read-Crime: ఇద్దరు కుమారులకు ఉరివేసి చంపిన తండ్రి.. అనంతరం తాను..!

క్షణికావేశంలో తండ్రిలై దాడి: తల్లిని వేధించడం తట్టుకోలేక.. ఇంట్లోని కత్తిని తీసుకుని తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన తండ్రి రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రిని హతమార్చిన మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలు, మద్యపాన వ్యసనమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News