Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుMinors Rape: బతుకమ్మ ఆడేందుకు వస్తే.. ప్రేమ పేరుతో ముగ్గురు బాలికలపై అత్యాచారం

Minors Rape: బతుకమ్మ ఆడేందుకు వస్తే.. ప్రేమ పేరుతో ముగ్గురు బాలికలపై అత్యాచారం

Minors Rape in Yadagirigutta: హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన ముగ్గురు బాలికలను ప్రేమ పేరుతో వలలో దింపి అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. మాటల్లో పెట్టి యాదగిరి గుట్టలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఒకరు మైనర్‌ కావడం గమనార్హం.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/crime-news/police-harassment-on-victim-in-chittoor-district/

అసలు పరిచయమే లేని ముగ్గురు బాలిక‌ల‌ను ప్రేమిస్తున్నామని మాయ‌మాటలు చెప్పి.. వారిపై అత్యాచారానికి పాల్ప‌డిన ఘటన ఈ నెల 20న చోటుచేసుకుంది. అల్వాల్ ప్రాంతానికి చెందిన  ముగ్గురు బాలిక‌లు 9వ తరగతి చదువుతున్నారు. బ‌తుక‌మ్మ ఆడేందుకు తమ ఇళ్లనుంచి బయలుదేరి ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప‌రిస‌ర ప్రాంతాల్లోకి వెళ్లారు. అక్క‌డున్న ఓ యువ‌కుడు వారిపై కన్నేసి.. వారి ద‌గ్గ‌రికి వెళ్లి మాట క‌లిపాడు. తియ్యగా మాయమాటలు చెబుతూ ప్రేమిస్తున్న‌ట్లు ఓ బాలికకు చెప్పాడు. ఆ కాసేపటికి మ‌రో ఇద్ద‌రు స్నేహితుల‌ను పిలిపించి మిగిలిన ఇద్దరు బాలికలకు పరిచయం చేశాడు.

ఆ ముగ్గురు బాలికలను ఈ ముగ్గురు యువకులు మాట‌ల్లో పెట్టి అదే రోజు యాద‌గిరి గుట్ట‌కు తీసుకెళ్లారు. దర్శనం అనంతరం బాలికలను ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి వారిపే యువ‌కులు అత్యాచారం చేశారు. తిరిగి వారిని హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌దిలిపెట్టారు. ఇంటికి చేరుకున్న బాలిక‌లను రాత్రంకా ఎక్కడికెళ్లారని తల్లిదండ్రులు నిలదీయడంతో  జ‌రిగిన విషయం చెప్పారు.

Also Read: https://teluguprabha.net/crime-news/lookout-notice-against-chaitanyananda-saraswati-following-allegations-of-sexual-harassment-of-students/

దీంతో ఆందోళనలో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాలికలకు కౌన్సిలింగ్ చేసి, అత్యాచారం జరిగినట్టు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను వెతికి పట్టుకుని అదుపులోకి తీసుకుని విచారించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, నిందితులు జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి మధు(19), షాపింగ్ మాల్లో పనిచేసే వంశీ(22), పెట్రోల్ బంకులో పనిచేసే నీరజ్(21)గా పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad