Mother sentenced 22 years Jail: తన ప్రియుడితో కలిసి 14 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేయడానికి సహకరించిన తల్లికి… ప్రత్యేక పోక్సో కోర్టు 22 ఏళ్ల శిక్షను విధించింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు.. తీర్పు రోజు కోర్టు నుంచి పరారవ్వడం గమనార్హం. దీంతో న్యాయస్థానం అతడిపై అరెస్టు వారంట్ జారీ చేసింది.
అసలేం జరిగిందంటే
నల్గొండ జిల్లా కేంద్రం లైన్‌వాడి ప్రాంతానికి చెందిన గ్యారాల శివకుమార్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అతడికి స్థానిక బీటీఎస్ కాలనీలో నివాసం ఉంటున్న వసంతపురి యాదమ్మతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. యాదమ్మకు 14 ఏళ్ల బాలిక ఉంది. దీంతో చిన్నారిపై కన్నేసిన నిందితుడు.. ఆ పాపను వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. యాదమ్మ కూడా శివకుమార్ మాటలకు లొంగిపోయి.. తన కూతురిని అతడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమైంది.
అనంతరం బలవంతంగా పెళ్లి చేసుకుని అనుభవించడానికి ప్రయత్నించగా.. బాలిక శివకుమార్ పై తిరగబడింది. అయినప్పటికీ అతడు యాదమ్మ సాయంతో బాలికను బెదిరించి బలవంతం చేశాడు. అయితే ఈ దారుణ ఘటన అనంతరం బాలిక ఇంటి నుంచి పారిపోయి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించి శివ కుమార్, యాదమ్మను అరెస్టు చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.
Also Read: https://teluguprabha.net/crime-news/20-year-old-woman-gang-raped-in-maharashtra-4-charged/
అయితే తీర్పు వెలువడే రోజు, శిక్ష తప్పదని గ్రహించిన శివకుమార్, మూత్రశాలకు వెళ్లి వస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. న్యాయమూర్తి విచారణ అనంతరం, యాదమ్మ నేరం అంగీకరించినట్లు నిర్ధారించి ఆమెకు 22 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. శివకుమార్ నేరస్తుడని తేల్చిన కోర్టు, అతడు హాజరుకాకపోవడంతో అరెస్టు వారంట్ జారీ చేసింది.


