Saturday, October 12, 2024
Homeనేరాలు-ఘోరాలుNelakondapalli: ఇక నాకు చావే దిక్కు

Nelakondapalli: ఇక నాకు చావే దిక్కు

ప్రభుత్వం ఆదుకోకపోతే 4 ఎకరాలు నీటి పాలు

ఆరుగాలం కష్టపడి పండించిన పంట మరి కొద్ది కాలంలో పంట చేతికి రానుంది.. అందుకోసం అందినకాడికల్లా అప్పులు తెచ్చి…కౌలుకు తీసుకుని సాగు చేసిండు..ప్రకృతి భీభత్సకు మొత్తం కొట్టుకపోయి..దుమ్ము మిగిలింది. పెట్టుబడి నీటిపాలైంది. ప్రభుత్వం ఆదుకోకపోతే నాకు దిక్కు లేదు…నాకు చావే దిక్కు అంటూ ఓ కౌలు రైతు ఆవేదన ఇది.
ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండాకు చెందిన తేజావత్ బాబురావు కౌలు రైతు చెరువుమాధారం చెరువు కింద నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. ఇప్పటికే రెండు పర్యాయాలు మందు చల్లిండు, రెండు సార్లు మందు పిచికారి చేసిండు… సాగుకు దాదాపు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. వరి కూడా చాలా ఏపుగా పెరిగింది. బిర్రు పొట్ట దశలో ఉంది. మరి కొంతకాలం అయితే పంట చేతికి వస్తుందని ఆశపడ్డాడు.

- Advertisement -

కానీ ప్రకృతి కోపంకు ఓ గిరిజన కౌలు రైతు బిడ్డ దారుణంగా నష్టపోయాడు. నాలుగు ఎకరాల పంట కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. పొలం నిండా రాళ్లు, ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. దీంతో కౌలు రైతు కుటుంబం బోరున విలపిస్తున్నాడు. కేవలం కౌలు సాగు మీద జీవనం సాగిస్తున్న కుటంబంపై ప్రకృతి పిడుగు వేసినట్లుగా మారింది. సదరు రైతుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. జరిగిన నష్టం ఎలా భర్తీ చేయాలి. కౌలు ఎలా తీర్చాలి అనే మనోవేదనతో మదనపడుతున్నాడు. ప్రభుత్వ అండ కోసం ఆశగా వీరంతా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తనకు చావు తప్ప మరోకటి లేదని కన్నీరు మున్నీరుగా విలపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News