Newly Married Techie Dies by Suicide: హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. కేవలం ఆరు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న అతడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. మృతుడిని రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన 28 ఏళ్ల శుభమ్ మీనాగా పోలీసులు గుర్తించారు.
ALSO READ: Honor Killing: చెల్లెలిని చంపి, మృతదేహం పక్కనే కూర్చుని పోలీసులకు ఫోన్ చేసిన అన్న
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుభమ్ మీనా ఆరు నెలల క్రితం ఢిల్లీకి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకుని, గురుగ్రామ్‌లోని భోండ్సీ ప్రాంతంలో నయాగావ్‌లోని మాతా కాలనీ సమీపంలో నివసిస్తున్నాడు. అతను ఒక MNCలో సంవత్సరానికి రూ. 20 లక్షల వేతనంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఎక్కువగా ఇంటి నుంచే (Work From Home) పనిచేస్తున్న శుభమ్ భార్య ఉన్నత విద్యను అభ్యసిస్తోంది.
ALSO READ: Shocking news: కాలేజీ వాటర్ ట్యాంక్‌లో కుళ్లిపోయిన మృతదేహం:10 రోజులుగా అదే నీరు తాగిన విద్యార్థులు
మంగళవారం మధ్యాహ్నం శుభమ్ తన గది నుంచి బయటకు వెళ్లి చాలా సేపటి వరకు తిరిగి రాలేదు. దీంతో అతని భార్య వెతకడం ప్రారంభించింది. ఇంటి పై అంతస్తుకు వెళ్లిన ఆమెకు, కిటికీకి వేలాడుతూ శుభమ్ కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
పొరుగువారు పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం, శుభమ్ గత కొంతకాలంగా డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నాడు. అంతేకాకుండా, గతంలో కూడా ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపారు.
“సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. దీంతో ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణం తెలియరాలేదు. అయితే, శుభమ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అతని కుటుంబ సభ్యులు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు,” అని ఆత్మహత్య సమాచారం అందుకుని స్పందించిన సబ్-ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Bengaluru crimes: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. భోజనానికి పిలిచి స్టూడెంట్ పై లైంగిక దాడి!


