Newly-Married Couple Found Dead: జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో విషాదం నెలకొంది. బెలాబగాన్ కాళీబారి ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఒక యువ దంపతులు మరణించి కనిపించడం బుధవారం మధ్యాహ్నం కలకలం రేపింది. ఈ జంటను రవి శర్మ (30), అతని భార్య లవ్లీ శర్మ (24)గా గుర్తించారు. వీరికి పెళ్లై దాదాపు సంవత్సరమైంది.
ALSO READ: Blackmail: అమ్మాయిల నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్.. 2021లో బెయిల్‌పై తప్పించుకున్న నిందితుడి అరెస్ట్!
తలుపు పగలగొట్టగా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ జంట ఉన్న గది లోపల నుంచి గడియ పెట్టి ఉంది. చాలా సేపటి వరకు వారు బయటకు రాకపోవడం, ఎంత తలుపు కొట్టినా స్పందన లేకపోవడంతో పొరుగువారు ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసు బృందం అక్కడికి చేరుకుని తలుపు బద్దలు కొట్టి చూడగా, ఇద్దరి మృతదేహాలు గదిలో పడి ఉన్నాయి. ఈ వార్త వేగంగా వ్యాపించడంతో ఇంటి బయట పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించారు.
ALSO READ: Bengaluru Doctor Wife Murder : “నీ కోసమే చంపేశా!” – భార్యను చంపి ప్రియురాలికి డాక్టర్ సందేశం
వివాదాలే కారణమా?
పోలీసు వర్గాల ప్రాథమిక పరిశీలన ప్రకారం, ఈ సంఘటన హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడటం కావచ్చని అనుమానిస్తున్నారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం తెలుస్తుంది.
రవి శర్మది బీహార్‌లోని సివాన్ జిల్లా కాగా, లవ్లీ దేవ్‌ఘర్‌లోని కాళిరేఖకు చెందినది. పెళ్లయినప్పటి నుంచి ఈ దంపతులు వైవాహిక కలహాలు ఎదుర్కొంటున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. కొన్ని నెలల క్రితం లవ్లీ కుటుంబ సభ్యులు ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ కుదిర్చారు. అప్పటినుంచి ఈ జంట మళ్లీ కలిసి ఉంటున్నారు.
మంగళవారం రాత్రి కూడా దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ గొడవ తర్వాతే ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరువైపులా కుటుంబ సభ్యులు సమాచారం అందుకొని దేవ్‌ఘర్‌కు చేరుకున్నారు. దంపతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పంపిన పోలీసులు, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Teen Kills Pregnant Minor Girlfriend: గర్భిణి అయిన మైనర్ ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపిన టీనేజర్


