Thursday, November 21, 2024
Homeనేరాలు-ఘోరాలుబ్రేకప్ చెప్పాలనుకునేలోగా మర్డర్ ! డ్రగ్స్ మత్తులోనే ఈ ట్విస్ట్

బ్రేకప్ చెప్పాలనుకునేలోగా మర్డర్ ! డ్రగ్స్ మత్తులోనే ఈ ట్విస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ దారుణ హత్య ఉదంతంలో నమ్మలేని నిజాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. తనను మతం మారమని ఓవైపు ఒత్తిడి చేసిన శ్రద్ధా లివ్ ఇన్ పార్ట్నర్ ఆఫ్తాబ్ చేష్టలను కొన్నింటిని ఆమె తన ఫ్రెండ్స్ తో షేర్ చేశారనే విషయాలు ఇప్పుడిప్పుడే బయటికి పొక్కుతున్నాయి. కొంతకాలంగా ఆఫ్తాబ్ చేతుల్లో తాను చిత్ర హింసలకు గురవుతున్నట్టు ఆమె కన్నీటి పర్యంతం అయ్యారుకూడా అంటూ ఫ్రెండ్స్ పెదవి విప్పుతున్నారు. ఇక పెళ్లి చేసుకోకుండానే తమ సహజీవనానికి బీటలు వారుతున్న నేపథ్యంలో ఇతర అమ్మాయిలతో ఆఫ్తాబ్ కు ఉన్న రిలేషన్స్ ను శ్రద్ధా గుర్తించారు కూడా. ఒక స్టేజ్ లో తన బాయ్ ఫ్రెండ్ తో వేగలేక విసిగి వేశారి చివరికి ఆమె బ్రేకప్ చెప్పాలని నిర్ణయం కూడా తీసుకున్నారనేది లేటెస్ట్ అప్డేట్. కానీ ఇలా శ్రద్ధా తనకు బ్రేకప్ చెబితే తన నిజరూపం బయటికి వస్తుందని, తన ఇమేజ్ బద్నాం అవుతుందని ఆఫ్తాబ్ చాలా భయపడి ముందే ఫిక్స్ అయినట్టు ఆమెను అంతం చేసినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ మత్తులోనే శ్రద్ధాను నిందితుడు హత్య చేశాడని పోలీసులు విశ్వసిస్తున్నారు. అయితే శ్రద్ధ శరీర భాగాలు కొన్నైనా దొరికితేకానీ ఈ కేసులో సాక్షాధారాలు లభించినట్టు ఇన్వెస్టిగేషన్ పూర్తికాదు. ఈనేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈకేసును శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా అతనిపై ఆమె చాలాసార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసినా తక్షణం పోలీస్ కంప్లైంట్ విత్ డ్రా చేసుకోవాలని.. లేకపోతే తాను సూసైడ్ చేసుకుంటానని ఆఫ్తాబ్ బెదిరించినట్టు శ్రద్ధా ఫ్రెండ్స్ పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News