Noida Girl Dies At School, Mother Appeals For “Justice”: ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో టీచర్స్ డే వేడుకల సందర్భంగా ఓ ఆరో తరగతి విద్యార్థిని అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సస్పెన్స్ నెలకొనగా, తన కూతురికి న్యాయం కావాలంటూ ఆ తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ALSO READ: Delhi High Court: పెళ్లయిన లవర్‌ని చేసుకోవాలంటే భరణం ఇవ్వాల్సిందే..!: ఢిల్లీ హైకోర్టు
ఈ ఘటన జరిగి కొన్ని వారాల తర్వాత తనిష్క తల్లి తృప్త శర్మ, సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసి తన ఆవేదనను వెళ్లగక్కారు. “నా కూతురు తనిష్కను సెప్టెంబర్ 4న నేను పాఠశాలలో విడిచిపెట్టాను. అది మా బిడ్డకు సురక్షితమైన రెండో ఇల్లు అనుకున్నాను. కానీ అదే పాఠశాలలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నా బిడ్డ తిరిగి రాదని నాకు తెలుసు. కానీ చివరి క్షణాల్లో ఆమెకు ఏం జరిగిందో తెలుసుకోవడం మా హక్కు. నాకు న్యాయం కావాలి, నిజం కావాలి” అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
A mother in Noida is still waiting for answers. 💔
Her daughter, Tanishka Sharma, died under mysterious circumstances at Presidium School.
It’s been 18 days, yet the administration hasn’t spoken a word. #JusticeForTanishka pic.twitter.com/RdkGrrGvWS— Greater Noida West (@GreaterNoidaW) September 22, 2025
పోస్ట్‌మార్టంలో తనిష్క శరీరానికి ఎలాంటి గాయాలు లేవని, మరణానికి గల కారణం అస్పష్టంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. దీంతో నిజం తెలుసుకోవాలంటూ తనిష్క తల్లి సెప్టెంబర్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాఠశాల యాజమాన్యం, సిబ్బందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పాఠశాల ప్రిన్సిపాల్ మానవతా శారద స్పందిస్తూ, తాము పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు.


