ఇంటికి చనువుగా వచ్చేవాడే… కీచకుడిగా మారాడు!
ఆగస్టు 13 సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ఈ దారుణం జరిగింది. బాధితురాలి భర్తతో కలిసి పనిచేసే చింటూ అగర్వాల్ అనే వ్యక్తి తరచుగా వారి అద్దె ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఆ చనువునే ఆసరాగా తీసుకుని, భర్త మార్కెట్‌కు వెళ్లిన సమయం చూసి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై చింటూ అగర్వాల్ అత్యాచారం చేశాడు.
బెదిరింపులతో బిగుసుకుపోయిన నోరు
తనపై దాడి చేయడమే కాకుండా, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా భర్తను చంపేస్తానని అగర్వాల్ ఆమెను తీవ్రంగా బెదిరించాడు. ఈ బెదిరింపులతో భయాందోళనకు గురైన బాధితురాలు, తన కుటుంబానికి ఏదైనా ముప్పు వస్తుందేమోనని ఆందోళన చెందింది. దానికి తోడు, ఇలాంటి విషయాలు బయటపడితే సమాజంలో పరువు పోతుందనే భయం కూడా తోడవడంతో, ఆ చేదు నిజాన్ని ఎవరికీ చెప్పలేకపోయింది.
ALSO READ: Stray Dog: దారుణం.. వీధి కుక్కను చంపి కన్ను పీకి దానితో ఆడుకున్న దుర్మార్గుడు
న్యాయం కోసం ఆలస్యంగా పోరాటం
తీవ్రమైన మానసిక సంఘర్షణ తర్వాత, ధైర్యం తెచ్చుకున్న ఆ మహిళ సెప్టెంబర్ 11న కాంటాబంజి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు తీవ్రతను అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. కాంటాబంజి సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) లక్ష్మీ నారాయణ్ మరాండి మాట్లాడుతూ… నిందితుడు చింటూ అగర్వాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేస్తున్నారు.
ALSO READ: Murder: పార్టీలో విపరీత సౌండ్ పట్ల వివాదం.. ఉద్యోగిని పొడిచి చంపిన నలుగురు మైనర్లు


