Thursday, April 10, 2025
Homeనేరాలు-ఘోరాలుOut of Jail: ఏడాది తరువాత.. ఎట్టకేలకు మాజీ హోం మంత్రికి బెయిల్

Out of Jail: ఏడాది తరువాత.. ఎట్టకేలకు మాజీ హోం మంత్రికి బెయిల్

మహారాష్ట్ర మాజీ హోం శాఖా మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ఏడాది తరువాత దేశ్ ముఖ్ కు బెయిల్ దొరకటం విశేషం. ముంబైలోని ఆర్ధర్ జైలు నుంచి బయటికి వచ్చిన ఆయనకు హీరోయిక్ స్వాగతం లభించటం ఇంకో హైలైట్. 72 ఆయన అవినీతి ఆరోపణలతో పీకల్లోతుల్లో చిక్కుకు పోయారు. దీంతో రంగంలోకి సీబీఐ దిగింది. నవంబర్ 2021లో ఈడీ అనిల్ దేశ్ ముఖ్ ను అరెస్ట్ చేసింది. మహారాష్ట్ర హోం మంత్రిగా ఉంటూనే పోలీసు ఉన్నతాధికారుల ద్వారా 4.70 కోట్ల లంచం వ్యవహారంలో తన అధికారాన్ని దురుపయోగం చేసినట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News