Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుPathikonda: జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాల్సిందే

Pathikonda: జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాల్సిందే

ఎక్కడ చూసినా విలేకరులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి

వాస్తవాలను వెలికి తీసి వార్తలు రాస్తే విలేకరులపై దాడులు చేయడం సిగ్గుచేటని ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు యం.సాల్ రంగడు అన్నారు. పత్తికొండ మండల పరిధిలోని హోసూరు గ్రామంలో పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు అమ్మాయిల పట్ల కీచికమైన ప్రవర్తన ప్రవర్తించడం వలన విద్యార్థినిలు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో విలేకర్ రాజేష్ గౌడ్ తదితర పత్రికా మిత్రులు వార్త కవరేజ్ సేకరణ కోసం వస్తున్న క్రమంలో కొంతమంది వైసిపి నాయకులు దాడి చేశారు. నిరసనగా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నాలుగు స్తంభాల కూడలి ఆవరణంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే పత్తికొండ నియోజకవర్గ అధ్యక్షులు యం.సాల్ రంగడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఎక్కడ చూసినా విలేకరులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని వీటిని ప్రభుత్వ అధికారులు గానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చెవిటి వాడి దగ్గర శంఖు ఊపినట్లుగా వివరిస్తున్నారని అన్నారు.

- Advertisement -

కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విలేకరులకు శాశ్వతమైన ప్రత్యేక చట్టాలను అమలు చేసి దాడులు పాల్పడినటువంటి వారిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం రెవెన్యూ రెవెన్యూ డివిజన్ అధికారి మోహన్ దాస్, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ కు వినతపత్రం ఈ కార్యక్రమంలో ఎపియూడబ్ల్యుజే జిల్లా నాయకులు ఇరుఫాన్, రాజేష్ గౌడ్ గౌరవ సలహాదారుడు ఎం.నాగరాజు నియోజకవర్గ సహకార దర్శి వి.హనుమంతు, చిన్నగిడ్డయ్య, ఉపాధ్యక్షులు రంగన్న, తాజు, ఏపిడబ్ల్యుజే నాయకులు మధుబాబు, లక్ష్మీనారాయణ, పకీరప్ప, పవన్, మంజు, జర్నలిస్టు జేఏసీ నాయకులు సురేష్, మల్లికార్జున, రవికుమార్, రాముడు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News