Saturday, November 15, 2025
HomeTop StoriesKhammam Scam: ఖమ్మం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా... గుట్టు రట్టు చేసిన...

Khammam Scam: ఖమ్మం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా… గుట్టు రట్టు చేసిన పోలీసులు?

Fake Pattadar passbook racket in Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా జోరుగా సాగుతోంది. భూ భారతిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ.. ఓ ముఠా రైతులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. డబ్బులు ఇచ్చి పట్టాదారు పుస్తకం కోసం వెళ్లగా.. నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఇచ్చేవారని పోలీసులు పేర్కొన్నారు. వివాదాల్లో ఉన్న భూములకు పాసు పుస్తకాలు ఇప్పిస్తామంటూ రైతులను మోసం చేస్తున్న మూఠా గుట్టును గుర్తించి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

డబ్బే లక్ష్యం: ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసలు గుర్తించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డబ్బే లక్ష్యంగా.. వివిధ రకాల మోసాలు, నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించినట్లుగా పేర్కొన్నారు. ఇటీవల పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తామని ఓ ముఠా రైతుల నుంచి డబ్బులు దండుకుంది. అయితే ఆ ముఠా వారికి నకిలీ పట్టాదారు పుస్తకాలు ఇచ్చారు. అనుమానం వచ్చిన రైతులు వెంటన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముఠా గుట్టును రట్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఠాలోని సభ్యులను సైతం అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-visited-medaram-for-temple-development-review/

బయ్యారంలో కలర్ జిరాక్స్‌‌ మిషిన్: గత కొంత కాలంగా వివాదాల్లో ఉన్న భూముల టార్గేట్ చేసుకొని ఈ దందా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. భూ భారతిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా రైతులను మోసం చేసినట్లు ఖమ్మం పోలీసులు తెలిపారు. డబ్బులు ఇచ్చి పట్టాదారు పుస్తకం కోసం రైతులు వెళ్లగా.. వారికి నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను ఇచ్చేవారని పేర్కొన్నారు. బయ్యారంలో కలర్ జిరాక్స్‌‌ మిషిన్లను మరియు పాల్వంచలో ప్రింటింగ్ మిషన్లను ఏర్పాటు చేసుకుని నకిలీ పాస్ పుస్తకాలతో దందా చేసినట్లు గుర్తించినట్లు పోలీసుల విచారణలో తేలింది. కొందరు రైతులకు పాస్ పుస్తకం ఇవ్వడం ఆలస్యం కావడంతో.. అనుమానం వచ్చిన కూసుమంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తనిఖీలు చేపట్టి పోలీసులు ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాతో పాటు ఆరు జిల్లాలలో ఈ ముఠా మోసాలు చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నకిలీ పాస్ పుస్తకాల దందాపై లోతుగా విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

పలు జిల్లాలకు పాకిన దందా: సచివాలయ ఉద్యోగిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి కూసుమంచి మండలంలోని జక్కేపల్లి వాసితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారితో ఒక ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా కలిసి ఖమ్మం, భధ్రాధ్రికొత్తగూడెంతో పాటుగా మహబూబాబాద్‌, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రైతుల నుంచి కోట్ల రూపాయల వసూలు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad