Cyber Crime| ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా వాడకం సాధారణమైపోయింది. దీని వల్ల ప్రజలకు లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటున్నాయి. సైబర్ నేరాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఫేక్ కాల్స్(Fake calls), స్పామ్ కాల్స్(Spam calls)విచ్చలవిడిగా వస్తున్నాయి. దీంతో ఏ కాల్ లిఫ్ట్ చేయాలో.. ఏది లిఫ్ట్ చేయకూడదనే గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అపరచితుల వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ముఖ్యంగా +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 ఇలాంటి నంబర్లతో ఫోన్ వస్తే లిఫ్ట్ చేయవద్దని సూచిస్తున్నారు. ప్రధానంగా +371 (లాత్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి కోడ్‌లతో మొదలయ్యే నంబరుతో ఫోన్ చేస్తారని..ఆ కాల్ ఎత్తిన తర్వాత వెంటనే హ్యాంగ్ చేస్తారన్నారు. తిరిగి ఫోన్ చేస్తే కాంటాక్ట్ జాబితాతో పాటు బ్యాంకు, క్రెడిట్ కార్డు ఇతర వివరాలు మూడు సెకన్లలో కాపీచేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా #90 లేదా #09 నంబర్లను నొక్కాలని ఎవరైనా సూచిస్తే అలా చేయొద్దని చెబుతున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.