14 Accused Of Raping Kerala Boy: కేరళలో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గే డేటింగ్ యాప్ ద్వారా పరిచయం పెంచుకున్న 16 ఏళ్ల బాలుడిపై రాజకీయ నాయకుడు, ప్రభుత్వ ఉద్యోగులు సహా 14 మంది అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు.
ALSO READ: Blackmail: మైనర్ కుమార్తె ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. మేనల్లుడిని చంపి, మృతదేహాన్ని కాల్చేసిన మామ
కాశరగోడ్ జిల్లా పోలీసు చీఫ్ విజయ భారత్ రెడ్డి ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ, బాధితుడు 10వ తరగతి విద్యార్థి అని తెలిపారు. బాలుడు రెండేళ్ల క్రితం ఈ డేటింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉండొచ్చని, అప్పటి నుంచి కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, ఎర్నాకులం జిల్లాల్లో 14 మంది నిందితులు అతడిపై అత్యాచారం చేశారని అనుమానం వ్యక్తం చేశారు.
“బాలుడి ఇంట్లోనే కాకుండా ఇతర జిల్లాల్లోని వివిధ ప్రదేశాల్లో కూడా ఈ దారుణాలు జరిగాయి. ఈ విషయం బాలుడి తల్లికి అనుమానం రావడంతో వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తమ ఇంట్లో నుంచి పారిపోవడాన్ని చూసిన తల్లి తన కొడుకును ప్రశ్నించగా, జరిగిందంతా చెప్పాడు. వెంటనే ఆమె చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు,” అని రెడ్డి తెలిపారు.
ALSO READ: Murder in Karnataka: కర్ణాటకలో దారుణం: ఆరేళ్ల బాలికను మూడో అంతస్తు నుంచి తోసి చంపిన సవతి తల్లి.!
బాలుడి వాంగ్మూలం ఆధారంగా, పోలీసులు మొత్తం 14 వేర్వేరు కేసులు నమోదు చేశారు. వీటిలో ఎనిమిది కేసులు కాసరగోడ్ జిల్లాకు చెందినవి కాగా, మిగిలిన ఆరు కేసులు కోజికోడ్, కన్నూర్ జిల్లాలకు బదిలీ అయ్యాయి. ఈ కేసుల దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు అయింది.
నిందితుల వయసు 25 నుంచి 51 ఏళ్ల మధ్య ఉంటుందని, వారిలో ఒకరు రైల్వే ఉద్యోగి అని కూడా పోలీసులు ధ్రువీకరించారు. నిందితుల్లో ఒక రాజకీయ నాయకుడు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఫుట్‌బాల్ కోచ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడిపై లైంగిక వేధింపులకు ఏమైనా నియంత్రణ లోపాలు కారణమయ్యాయా అని పోలీసులు యాప్‌ను కూడా పరిశీలిస్తున్నారు.
ALSO READ: Class 9 Girl Suicide: ప్రేమ పేరుతో ట్రైనీ కానిస్టేబుల్ మోసం.. 9వ తరగతి విద్యార్థిని సూసైడ్


