Friday, April 4, 2025
Homeనేరాలు-ఘోరాలుViveka: వివేకా కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం

Viveka: వివేకా కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం

వివేకా కేసులో(Viveka murder case) ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగన్న(Watchmen Ranganna) మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రారంభమైంది. పులివెందుల లయోల పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు.

- Advertisement -

రీ పోస్టుమార్టంలో తిరుపతి ఎఫ్ఎస్ఎల్ టీం, కడప వైద్య బృందంతో పాటు ఫోరెన్సిక్ టీం పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, జమ్మలమడుగు డిఎస్పీ, పులివెందుల తహసీల్దార్, వీఆర్వోల సమక్షంలో రంగన్న మృతదేహం వెలికితీశారు.

వాచ్ మాన్ రంగయ్య మృతిపై రంగయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని కడప ఎస్.పి తెలిపారు. వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి మరణించడం హై ప్రొఫెషనల్ మర్డర్ గా మేము భావిస్తున్నాము. రంగయ్య మరణం వెనుక ఎవరి ప్రమేయం ఉంది.ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా ఎస్.పి పేర్కొన్నారు.

దీంట్లో భాగంగా 2014 సం. నుండి 2024 మధ్య హత్య కేసులోని 6 మంది ప్రధానమైన సాక్షులు చనిపోవడం జరిగింది. 2019 లో శ్రీనివాస రెడ్డి, శంకర్ రెడ్డి, 2022 లో గంగాధర రెడ్డి, 2024 సెప్టెంబర్ లో వై.ఎస్ అభిషేక్ రెడ్డి, నారాయణ ఇప్పుడు రంగయ్య మరణించడం జరిగిందన్నారు. గతంలో వై.ఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు మరణించినపుడు పోలీసు వల్ల, సి.బి.ఐ వల్ల చనిపోయారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, దీని వెనుక ఎవరున్నారు..ఎందుకిలా చేస్తున్నారని ప్రధానమైన కేసును కప్పి పుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా..అనే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News