Pregnant Woman Dies 6 Months After Marriage: రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం వివాహమైన ఒక గర్భిణీ స్త్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం కోసం తనను వేధించి, కొట్టి చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె భర్తపై ఆరోపణలు చేస్తున్నారు.
ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 12.30 గంటల సమయంలో ఓల్డ్ టోంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మరణించిన మహిళను మనీషాగా పోలీసులు గుర్తించారు.
పోలీస్ క్లర్కే నిందితుడు
మనీషా భర్త కులదీప్ నాయక్ ఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లైన ఆరు నెలలకే మనీషా మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కట్నం వేధింపులే మనీషా మరణానికి కారణమని ఆమె భర్త కులదీప్‌పై కేసు పెట్టారు.
ALSO READ: Breakup: మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి, యువకుడి ఆత్మహత్య.. ఆమె బ్రతికింది.. అతను చనిపోయాడు
మృతురాలు మనీషా సోదరుడు ప్రహ్లాద్ వివరాల ప్రకారం, సవాయి మాధోపూర్ జిల్లాకు చెందిన కులదీప్ నాయక్ తమ కుటుంబం నుంచి తరచూ కట్నం డిమాండ్ చేసేవాడని ఆరోపించారు. అంతేకాక, పోలీసు శాఖలో తనకున్న ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని తమ కుటుంబాన్ని బెదిరించడానికి ప్రయత్నించేవాడని తెలిపారు. కట్నం డిమాండ్లు తీర్చకపోవడంతో తరచూ మనీషాను దారుణంగా కొట్టేవాడని ప్రహ్లాద్ వాపోయాడు.
ALSO READ: Man Slits Twin Daughters’ Throats: భార్యపై కోపం.. రెండేళ్ల కవల కుమార్తెల గొంతు కోసి చంపిన తండ్రి
ప్రహ్లాద్ ఇంకా మాట్లాడుతూ, “కులదీప్ తరచూ తన సోదరి మనీషా తన కుటుంబంతో మాట్లాడటానికి కూడా అనుమతించేవాడు కాదు. రక్షా బంధన్, దీపావళికి ముందు కూడా ఆమెను దారుణంగా కొట్టాడు,” అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లర్క్ కులదీప్ నాయక్‌ను విచారిస్తున్నామని, దర్యాప్తులో పూర్తి నిజాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
ALSO READ: Tribal Minors Gang Raped: ఒడిశాలో ‘జాతర’ చూసి వస్తుండగా ఇద్దరు మైనర్ గిరిజన బాలికలపై గ్యాంగ్ రేప్


