Pregnant Woman Dies After Consuming Poison: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ గర్భిణీ భార్యాభర్తలు ఇద్దరూ విషం సేవించారు. ఈ ఘటనలో గర్భిణీ అయిన భార్య మరణించగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన పిలిభిత్ జిల్లాలోని నౌరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఠాకుర్‌ద్వారా ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
ALSO READ: Accidental Shooting: ఇంట్లో తుపాకీతో ఆడుకుంటూ కాల్చుకున్న ఐదేళ్ల బాలుడు మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు సీతూ (27), ఆమె భర్త రాజు (36). వీరికి ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. సీతూ గర్భవతి కూడా. దర్యాప్తులో భాగంగా, రాజు గతంలో సంజన అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు తేలింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.
ALSO READ: Woman Gang Raped: పుట్టినరోజు పార్టీకి పిలిచి యువతిపై గ్యాంగ్ రేప్
ఆదివారం రాత్రి కూడా ఇలాంటి ఘర్షణే చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులిద్దరూ విషం సేవించారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సీతూ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం రాజు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై నౌరియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ గాయత్రి మాట్లాడుతూ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని, పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత తెలుస్తాయని అన్నారు.
ALSO READ: Woman Set On Fire: మంటల్లో కాలుతూనే స్కూటర్ నడిపి ఆసుపత్రికి మహిళ.. చికిత్స పొందుతూ..


