Pune Man Films Wife Bathing, Blackmails Her: పుణెలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేయసాగాడు ఓ కిరాతక భర్త. అది కూడా కారు ఈఎమ్‌ఐ కోసం డబ్బులు తేవాలని. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం వారికి 2020లో వివాహం జరిగింది. వారిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. అయితే భర్త తనను కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తాము సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీయడం సహా తాను స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని చెప్పింది. తన కారు ఈఎమ్‌ఐ కట్టడానికి డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించినట్లు తెలిపింది.
మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడు సహా మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీడియో ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.


