Pune Rape Case: పూణెలో డెలివరీ బాయ్ రేప్ కేసులో బిగ్ ట్విస్ట్ బయట పడింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు డెలివరీ బాయ్ చెప్పిన మాటలకు పోలీసులు ఖంగుతిన్నారు. ఈ అత్యాచార కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులకు.. విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు.
వివరాల్లోకి వెళితే.. పూణెలో అదొక పెద్ద బిల్డింగ్. బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో కొరియర్ బాయ్ పార్శిల్ నెపంతో ఇంట్లోకి వచ్చి.. తనపై అత్యాచారం చేశాడంటూ ఐటీ ప్రొఫెషనల్ అయిన ఓ యువతి (22) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక రంగంలోకి దిగిన ఖాకీలు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడైన డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం చెప్పడంతో అంతా షాక్‌కు గురయ్యారు.
ఆమె బెస్టీ చేసిన నిర్వాకం..
ఈ అత్యాచారం చేసింది మరెవరో కాదు సాక్ష్యాత్తూ ఆ యువతి బాయ్‌ఫ్రెండే. ఇదే విషయాన్ని పూణె పోలీసులు తేల్చి చెప్పారు. వారిద్దరి మొబైల్స్‌ను పరిశీలించగా సంబంధిత ఆధారాలు లభించాయి. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని టైమ్‌లో ఆ యువతి.. స్నేహితుడిని ఇంటికి పిలుస్తూ ఉంటుంది. అదే మారిదిగా ఈసారి బుధవారం రాత్రి కూడా అలానే తన ఇంటికి పిలిపించుకుంది. స్నేహితుడు ఎప్పుడు ఇంటికి వచ్చినా కొరియర్ బాయ్ రూపంలోనే ఇంటికి వచ్చేవాడని తెలిసింది.
బుధవారం రాత్రి కూడా పార్శిల్ తెచ్చినట్లు నెపంతో ఇంటికి వచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. అనంతరం వారిద్దరూ గదిలోకి వెళ్లాక.. శృంగారం చేసేందుకు ఆమె బెస్ట్ ఫ్రెండ్ బలవంతం చేశాడట. కానీ ఆ పని తనకి ఇష్టం లేదట. అయినా బలవంతం చేసినా తన బాయ్ ఫ్రెండ్‌పై విపరీతమైన కోపం రావడం వల్ల సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేలింది. కొరియర్ బాయ్ తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. తనపై పెప్పర్ స్ప్రే చల్లి బలవంతంగా రేప్ చేశాడని కట్టుకథ అల్లింది. అయితే వెళ్లే ముందు తన మొబైల్‌లో నిందితుడు సెల్ఫీ తీసుకున్నాడని.. మళ్లీ వస్తానని చెప్పాడంటూ నాటకం ఆడింది.
అయితే నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు విచారించగా అసలు ఆ యువతి అసలు బాగోతం బయటపడింది. పోలీసులు తమదైన స్టైల్లో యువతిని విచారించగా.. అసలు నిజాన్ని ఆమె కూడా అంగీకరించింది. బలవంతంగా అత్యాచారం చేశాడనే కోపంతో కంప్లైంట్ చేసినట్లు నేరాన్ని ఒప్పుకుంది.
ఇందులో గమ్మత్తైన విషయం ఏమిటంటే.. నిందితుడు సెల్ఫీ తీసుకున్నాడని పోలీసులకు కంప్లైంట్‌లో చెప్పిన మహాతల్లీ, ఆమె తన స్వహస్తాలతో ఇద్దరి సెల్ఫీ తీసుకున్నట్లు తేలింది. అయితే మార్ఫింగ్ చేసి తనను బెదిరించాడని పోలీసులను నమ్మబలికింది. అయితే వారిద్దరి కుటుంబాలు పరిచయస్తులే కావడం విశేషం.
ఇదిలా ఉండగా ఈ అపార్ట్‌మెంట్‌కు ఆ యువతి ఫ్రెండ్ పలుమార్లు వచ్చాడని తెలిసింది. వారి కుటుంబంలోని అనేక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నట్లుగా అక్కడి నివాసితులు చెప్పారు. తెలిసిన వ్యక్తే కదా అని ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తోంది.