Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుQR code for police complaint: ఉన్నచోటే QR కోడ్ ద్వారా పోలీస్ కంప్లైంట్

QR code for police complaint: ఉన్నచోటే QR కోడ్ ద్వారా పోలీస్ కంప్లైంట్

ఫిర్యాదుల స్వీకరణకు ప్రజలకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం

మహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ టీమ్ బృందాలు అధికారుల పర్యవేక్షణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్నాయని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ చంద్ర మోహన్ తెలిపారు. కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్ లు ఆకతాయిలు ఆగడాలకు అడ్డుకట్టు వెస్తునాయని అన్నారు.రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, విద్యాసంస్థలు, దేవాలయాలు పరిసర ప్రాంతాల్లో షీ టీమ్ పోలీసులు మఫ్టీలో ఉంటూ ఆకతాయిలకు చెక్ పెడుతున్నారన్నారు.
మహబూబాబాద్, తొర్రూరు సబ్ డివిజన్ పరిధు లలో షీ టీం పోలీసులు బస్ స్టాండ్,రైల్వే స్టేషన్,ముఖ్య కుడలులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రస్తుత తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి పనిచేస్తున్నారని తాము పనిచేస్తున్న రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని, అలాంటి వారికి షి టీమ్స్ ఎల్లపుడు అండగా నిలుస్తూ దైర్యన్ని ఇస్తాయన్నారు. అవగాహన కార్యక్రమాలు పెంచడం ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారని షీ-టీమ్ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజల ఆదరణ పొందుతున్నాయన్నారు.
తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగ డాలను వీడియో రికార్డ్ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో కేసులు సైతం నమోదు చేస్తున్నారన్నారు. ఆకతాయిలు వెంటపడి వేధించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తిస్తే 100, 112,తో పాటు 7901142009,8712656935వాట్సప్ నంబర్ లో సంప్రదించాలని , ఉన్నచోట నుండి ఫిర్యాదు చేయడానికి qr.tspolice.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. బస్టాండ్, పాఠశాలలు. కళాశాలల వద్ద మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం, జిల్లా పరిధిలోని పోలీసు స్టేషన్ లలో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పాఠశాలలు, కళాశాలల వద్ద షీ-టీమ్ ఫోన్ నంబర్లు తెలిసేలా ఏర్పాట్లు చేశామోన్నారు. ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు నిర్భయంగా ముందుకు రావాలనీ, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
జిల్లా కేంద్రంలోని కొన్ని ఏరియాలలో, సినిమా థియేటర్ పరిసర ప్రాంతాలలో ఉండే యువత చెడు అలవాట్లకు ముఖ్యంగా గంజాయి మత్తుకు బానిస అవుతున్నారన్నారు. చదువుకోవాల్సిన వయసులో మైనర్లు ఈ విధంగా దొంగతనాలకు పాల్పడడం, మత్తు పదార్థాలకు బానిసవ్వడం, మహిళలపై వేధింపులకు పాల్పడటానికి వెనుకాడటం లేదు. ఇటువంటి వాటి గురించి కాలేజీలు, హాస్టల్ లు , గ్రామాలలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News