Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుRajasthan: కట్టేసి కొట్టి..మూత్రం తాగించి.. ప్రేమికుడిపై పోక్సో కేసు పెట్టి..

Rajasthan: కట్టేసి కొట్టి..మూత్రం తాగించి.. ప్రేమికుడిపై పోక్సో కేసు పెట్టి..

రాజస్థాన్ లో ఓ ప్రేమికుడికి చుక్కలు చూపించారు గ్రామస్థులు. రాజస్థాన్ లోని జాలోర్ జిల్లాలో తన ప్రేమికురాలిని కలిసేందుకు వచ్చిన వ్యక్తిని చెట్టుకు కట్టేశారు. ఇష్టానుసారంగా బాది.. అతని నోట్లోకి మూత్రం పోసి.. నానా రచ్చచేశారు స్థానికులు.

- Advertisement -

ఈ ఘటనంతా వీడియో తీసి మరీ చేశారు. వీడియో ఆధారంగా ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం రాత్రి తన ప్రేమికురాలిని కలుసుకునేందుకు సమీప గ్రామం నుంచి తాను వచ్చినట్టు బాధితుడు పోలీసులముందు వాపోయాడు. ఈ మొత్తం ఘటనలో అమ్మాయి కుటుంబం కూడా ఉందని అతను చెప్పటం విశేషం. అయితే అతని ప్రేయసి కూడా పోక్సో చట్టం కింద బాధితుడి మీద కేసు పెట్టడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News