Rape On Buffalo Calf: దేశంలో ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల వికృత చేష్టలు ఆగడం లేదు. అప్పుడే పుట్టిన పసికందు నుంచి మూలకు పడిన వృద్ధురాలి వరకూ.. కామాంధుల దాహానికి బలవుతున్నారు. కానీ కొందరు కీచకులు మూగ జీవాలను కూడా వదలడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలో గేదె దూడపై అత్యాచారం ఘటన ఆందోళనను కలిగిస్తోంది.
Also Read: https://teluguprabha.net/crime-news/woman-dies-by-suicide-in-lover-house-at-nagole/
ఇటీవల వనపర్తి జిల్లాలో బర్రెలపై అత్యాచారం చేస్తూ ఓ వ్యక్తి మృతిచెందిన విషయం అలజడి సృష్టించింది. ఆ ఘటన మరువకముందే తాజాగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లిలో ఓ కామాంధుడు బర్రె దూడపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మీర్జాపల్లికి చెందిన సిద్దిరాములు అనే వ్యక్తికి కొన్ని పశువులు ఉన్నాయి. పొలంలో ఉన్న షెడ్డులో బర్రెలను కట్టేస్తారు.
ఎప్పటిలానే యజమాని ఆదివారం సాయంత్రం గేదెలను అక్కడ కట్టేసి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో బిహార్‌కు చెందిన రోహిత్ అనే వ్యక్తి అక్కడే పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో షెడ్డులోకి వచ్చిన నిందితుడు.. ఏడాది వయస్సు ఉన్న బర్రె దూడపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో చూసిన షెడ్డు యజమాని.. ఆ కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళనను కలిగిస్తోంది.


