Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుRoad Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకలో ఆడుతూ పాడుతూ గడపాల్సిన వారంతా తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. పెళ్లిబృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ సహా ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం బుధవారం సాయంత్రం పూతలపట్టు లక్ష్మయ్య గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి.

- Advertisement -

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులంతా ఐరాల మండలం జంగాలపల్లి ఎస్సీ కాలనీకి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad