Karnataka Road accident: కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వ్యాను ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు తెలంగాణవాసులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో తెలుగు ప్రజలు ప్రయాణం అంటేనే జంకుతున్నారు.
రోడ్డు ప్రమాదం వార్త వింటేనే తెలుగు రాష్ట్ర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత రెండు వారాలనుంచి ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాను, కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన వారిగా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40)గా అధికారులు ధృవీకరించారు. వీరంతా గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
Also Read: https://teluguprabha.net/crime-news/hyderabad-woman-suicide-with-daughter-in-hussain-sagar/
దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరం: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో జరిగిన ప్రమాదాల్లో కుడా మన తెలుగు వారే మరణిస్తున్నారు. దీంతో తెలుగు ప్రజలు ప్రయాణం అంటేనే జంకుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక పరిష్కారాలను చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అవసరమైన చర్యలను చేపట్టాలని కోరుతున్నారు. వివిధ అవసరాల నిమిత్తం రహదారులపై నిలిపి ఉంచే వెహికల్స్‌ను వెంటనే తొలగించేలా చూడాలని కోరుతున్నారు. నిలిపి ఉన్న వాహనాల వద్ద సైన్ బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా వాహనదారులకు పోలీసులు సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నారు. వాహనదారులు రాంగ్రూట్లో వెళ్లకుండా కఠిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.


