Road Accident Jagtial: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా దారి కాచిన మృత్యువు నలుగురిని కబళించింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/high-court-postpones-ibomma-ravis-bail-petition/
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముగిలిపేట వద్ద ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. కూలీలు పసుపు కోతకి వెళ్లి తిరిగి వస్తుండగా.. మంగళవారం సాయంత్రం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురూ మహిళలే. ట్రాక్టర్‌లో సుమారు 8 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కూలీలు పసుపు లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ ఎక్కి తిరుగు ప్రయాణం అయినట్లుగా స్థానికులు తెలిపారు.

