Homeనేరాలు-ఘోరాలుBreaking: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్‌!

Breaking: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్‌!

Srikalahasti road accident: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఓ అంబులెన్స్.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

మృతులు బెంగాల్‌ వాసులు: బాధితులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారు. ఓ రోగిని మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి సమీపంలో అంబులెన్స్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, నిలిపి ఉంచిన లారీని వేగంగా ఢీకొట్టింది.

అంబులెన్స్ క్యాబిన్ నుజ్జునుజ్జు: ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ క్యాబిన్ నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను వెలికితీయడం కష్టతరమైంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News