Gold Theft from Olympic Athlete’s Mother: దొంగతనాల్లో కొత్త పంథాను ఎంచుకుంటున్నారు దుండగులు. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడటం చూస్తుంటాం.. కానీ ఇప్పుడు కొత్తగా హిప్నటైజ్ అనే మార్గాన్ని ఎంచుకుని బంగారం చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరాఖాండ్‌లో ఒలింపిక్ క్రీడాకారుని తల్లిని హిప్నటైజ్ చేసి రూ. 5 లక్షల విలువైన బంగారం చోరీ చేశారు. ఈ ఘటన చర్చనీయాంశమైంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/female-constable-died-in-warangal/
డెహ్రాడూన్‌లో ఒలింపిక్ అథ్లెట్ సూరజ్ పన్వర్ తల్లిని హిప్నటైజ్ చేసి, ఆమె నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దోచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరజ్ తల్లి పూనమ్ పన్వర్ అటవీశాఖ ఉద్యోగినిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఉదయం సిమ్లా బైపాస్‌లోని తన ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను హిప్నటైజ్ చేసి ఒంటి మీద నగలు, పర్సులో నగదు తీసుకుని పారిపోయారు. క్షుద్ర శక్తుల పేరుతో ఆమెను హిప్నటైన్ చేసి చెట్టు కిందకు తీసుకెళ్లి.. పర్సులోని నగదు, ఒంటి మీది ఆభరణాలు దోచుకెళ్లారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/eesha-rebba-about-trivikram-offered-role-in-aravinda-sametha/
సూరజ్ పన్వర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

