Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుRudravaram: అంతరించిపోతున్న జామాయిల్ వనాలు

Rudravaram: అంతరించిపోతున్న జామాయిల్ వనాలు

పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు

వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ఫారెస్ట్ ఉన్నతాధికారులు రుద్రవరం అటవీ రేంజ్ లోని రుద్రవరం ఫారెస్ట్ సెక్షన్ అప్పనపల్లె గ్రామ సమీపంలో జామాయిల్ చెట్ల వనాలను పెంచారు. ఈ వనాలలో దాదాపు 15 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు పెరిగి పెద్ద వృక్షాలుగా ఎదిగాయి. ఈ చెట్లను ఫారెస్ట్ అధికారులు సంరక్షించాల్సి ఉండగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పట్టించుకోకపోవడంతో కొందరు ఏపుగా పెరిగిన చెట్లను స్వార్ధపరులు గొడ్డలితో నరికి, తమ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు.

- Advertisement -

ఫారెస్ట్ అధికారులు చెట్లను నరుకుతున్న వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వందలాది జామాయిల్ చెట్లు నేలకు ఒరుగుతున్నాయి. విశాఖ అధికారులు సిబ్బంది పర్యవేక్షణ లోపం నిర్లక్ష్యం కారణంగా వందలాదిగా ఉన్న చెట్లు నేడు పదుల సంఖ్యలో ఉండడంతో పెంచిన వనాలు అంతరించిపోతున్నాయి.

ఉన్న చెట్లను అధికారులు కాపాడక లేకపోతే రాబోయే రోజుల్లో వనమంతా పూర్తిగా అంతరించిపోయే ప్రమాదముంది. ఉన్నతాధికారులు స్పందించి జామాయిల్ వనాలను కాపాడాలని సమీప గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News