Crime : మహారాష్ట్రలోని సతారా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ దేవ్‌రాజ్ కాలే, ట్రాఫిక్ చెకింగ్‌లో జరిమానా తప్పించుకునేందుకు మహిళా కానిస్టేబుల్ భాగ్యశ్రీ జాదవ్‌ను సుమారు 120 మీటర్లు ఆటోతో ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన ఖండోబా మాల్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు జరిగింది. స్థానిక దుకాణం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం రికార్డై, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ALSO READ: Telangana : తెలంగాణలో యూరియా కొరత.. పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
సతారా నగరంలోని ఓ రద్దీ కూడలిలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా, భాగ్యశ్రీ జాదవ్ ఆటోను ఆపమని సైగ చేశారు. అయితే, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ దేవ్‌రాజ్ కాలే ఆటోను ఆపకుండా వేగంగా నడిపాడు. ఆటోను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భాగ్యశ్రీ ఆటోకు ఇరుక్కుపోయి, 120 మీటర్లు ఈడ్చుకెళ్లబడ్డారు. ఈ సమయంలో ఆమె తీవ్రంగా గాయాపడ్డారు. స్థానికులు ఆటోను వెంబడించి, రోడ్డుపై అడ్డుకోవడంతో ఆటో ఆగింది. ఇక ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు డ్రైవర్‌ను చితకబాది, పోలీసులకు అప్పగించారు.
పోలీసులు దేవ్‌రాజ్ కాలేను అరెస్ట్ చేసి, భాగ్యశ్రీ జాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గాయపడిన భాగ్యశ్రీని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన సతారాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


