ఇటుపక్క స్కూలు అటుపక్క చెరువు ఏం చేయలేని పరిస్థితుల్లో టీచర్స్, విద్యార్థులు.. ఇది కొల్చారం మండలం, పోతంశెట్టిపల్లిలోని స్కూల్ దుస్థుతి. స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రైమరీ స్కూల్ జలమయం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు గత రెండు సంవత్సరాల నుంచి ఇదే జలదిగ్భంధంలో చదువుకోవాల్సి వస్తోంది. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఇద్దరు లేడీ టీచర్లుండగా, ఎవరికి చెప్పినా స్పందించని అధికారులు ప్రవర్తనతో, ఏ క్షణంలో ఏం జరగబోతుందో తెలియని పరిస్థితిలో స్కూల్ కు వెళ్తున్నారు. ఒకపక్క చెరువు మరోపక్క స్కూలు కావడంతో స్కూల్లో తేమ వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రతిరోజు స్కూల్ లోకి పాములు వస్తుంటాయని, స్కూల్ కు రావాలంటే వణికిపోతున్నట్టు వివరిస్తున్నారు. ఈ స్కూల్ విషయం ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో ఏం చేయాలో అగమ్యగోచరంగా తమ పరిస్థితి ఉందని టీచర్లు వాపోతున్నారు.
School in water: నీట మునిగిన ప్రైమరీ స్కూల్
ఏం చేయలేని పరిస్థితిలో ఇద్దరు లేడీ టీచర్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES