Monday, July 14, 2025
Homeనేరాలు-ఘోరాలుTeacher Sexual Assault: కి'లేడీ' టీచర్ లైంగిక వేధింపులు..10వ తరగతి విద్యార్థిని హోటల్‌కి తీసుకెళ్లి ప్రతిరోజు...

Teacher Sexual Assault: కి’లేడీ’ టీచర్ లైంగిక వేధింపులు..10వ తరగతి విద్యార్థిని హోటల్‌కి తీసుకెళ్లి ప్రతిరోజు కామవాంఛ తీర్చుకుంటూ..!

Teacher Sexually Assaulted Male Student: ముంబయిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌ టీచర్‌ పదో తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. 40 ఏళ్ల మహిళా ఇంగ్లీష్ టీచర్‌ తన కుమారుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిందని విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది పాటు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మహిళా టీచర్‌ని అరెస్ట్ చేశారు. బాధితుడి వయస్సు కేవల 16 ఏళ్ల మాత్రమే. ప్రస్తుతం అతను ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు.

- Advertisement -

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2023 డిసెంబర్‌లో పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవానికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా టీచర్‌తో సదరు విద్యార్థికి కాస్త చనువు ఏర్పడింది. అనంతరం మహిళ టీచర్ అతనిపై ఒత్తిడి తీసుకొచ్చి లైంగిక వేధింపులకు పాల్పడడం ప్రారంభించింది. ఇదే సమయంలో శారీరకంగా వేధించడం ప్రారంభించినట్టు విద్యార్థి కంప్లైంట్‌ ఆధారంగా పోలీసులు తెలిపారు. ఆ యువకుడిని పలుమార్లు హోటల్స్‌కు తీసుకెళ్లి, మద్యం తాగింపజేసి లైంగిక వేధింపులకు గురిచేసినట్టు విచారణలో తేలింది.

మాయమాటలు చెప్పి:

ముందు అతను దీనికి అంగీకరించకపోవడంతో వేరే పాఠశాలలో చదువుతున్న తెలిసిన అమ్మాయి సహకారాన్ని టీచర్‌ కోరింది. దీంతో ఆ అమ్మాయి విద్యార్థిని ప్రలోభ పెట్టింది. ఇలాంటి సంబంధాలు సర్వసాధారణమే అని అతడిని ఆ అమ్మాయి ఒప్పించింది. వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మిన విద్యార్థి టీచర్‌ని కలిసేందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో పలుమార్లు అతనిని ఏకాంతంగా కలవాలని కొన్ని షరతులు పెట్టింది. గత ఏడాదికాలంగా ఆ టీచర్ విద్యార్థిపై లైంగిక దాడులు చేస్తూ కామ వాంఛను తీర్చుకుంటున్నట్టు తేలింది.

తల్లిదండ్రులకు అనుమానం:

అయితే విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మార్పులను గమనించిన తల్లిదండ్రులు అసలు నిజాన్ని తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు అనంతరం మహిళా టీచర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమెపై పాక్సో చట్టం (POCSO Act) 4, 6, 17 సెక్షన్లతో పాటు, భారతీయ శిక్షా సంహిత (IPC) మరియు జువెనైల్ జస్టిస్ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. ఈ విషయం బయటికి రావడంతో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఈ ఘటన ముంబాయి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం టీచర్ పోలీసు కస్టడీలో ఉంది. దీనిపై పూర్తి విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.

ఈ వార్త సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో పలువురు తమకు నచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. విద్యార్థులకు పాటలు బోధించాల్సింది పోయి ఇలాంటి పాడు పనులు నేర్పించడం ఏంటని కొందరు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వార్తలు చూసినప్పుడు సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదని మరికొందరు వ్యంగ్యంగా తమదైన స్టైల్‌లో కామెంట్ చేశారు. ఇదే సమయంలో విద్యార్థుల సేఫ్టీ, బాగోగుల పట్ల తల్లిదండ్రులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News