పేరెంట్స్ దెబ్బకి ఓ స్కూల్ టీచర్ (School Teacher) గోడ దూకి పారిపోవాల్సి వచ్చింది. సహజంగా విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు బుద్ధి చెబుతారు. కానీ ఉపాధ్యాయుడు తప్పు చేస్తే అభంశుభం తెలియని విద్యార్థులు ఏం చేయగలరు? అందుకే వారి తల్లిదండ్రులు బెత్తం తీసుకుని ఉపాధ్యాయుడికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఉరికించి కొట్టారు.
ఘటనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే… మంచిర్యాలలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినిలతో సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. టీచర్ వేధింపులు భరించలేక స్టూడెంట్స్ వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థినిల తల్లిదండ్రులు టీచర్ కి బుద్ధి చెప్పేందుకు పాఠశాలకి వచ్చారు. వారిని చూసి ఉపాధ్యాయుడు గోడ దూకి పారిపోయాడు. అయినా పేరెంట్స్ వదలకుండా వెంటపడి జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉపాధ్యాయుడు సత్యనారాయణను పట్టుకుని చితకబాదారు. అనంతరం ఉపాధ్యాయునిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.