Shocking incident at maharashtra:వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. క్షీణిస్తున్న జీవనశైలి, ఒత్తిడి లాంటి అనారోగ్య కారణాలతో ప్రాణాలు హరిస్తున్నాయి. కొందరు జిమ్ చేస్తుండగ, మరికొందరు డ్యాన్స్ చేస్తూ, ఇంకొందరు పాడుతూ, ఆడకుంటూ గుండెపోటుకు గురవుతున్న వార్తలు వింటూనే ఉన్నాం. ఇక చిన్న పిల్లలను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన కన్నీరు పెట్టిస్తుంది.
తల్లి ఒడిలో తుది శ్వాస: మహారాష్ట్రలో కొల్హాపూర్ జిల్లాలోని కోడోలిలో గణేష్ పండుగ సందర్భంగా ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన జరిగింది. గణేష్ పండుగ ఘనంగా జరిగింది. గణేష్ ఉత్సవాలతో గ్రామమంతా ఆనంద వాతావరణం నెలకొంది. అయితే.. ఒక తల్లి పెట్టిన కేకలు ఆ గ్రామాన్ని విషాదఛాయలతో నింపింది. శ్రావణ్ గవాడే అనే పదేళ్ల బాలుడు గుండెపోటుతో మరణించడంతో తల్లి తల్లడిల్లింది. స్నేహితులతో సరదాగా ఆడుకుంటుండగా.. అలసిపోయాడు శ్రావణ్. ఆ తర్వాత అతను తన తల్లి వద్దకు వెళ్లి ఒడిలో పడుకుని తుది శ్వాస విడిచాడు.
శ్రావణ్ గవాడే తన స్నేహితులతో గణేష్ మండపం వద్ద ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఆటను వదిలి తల్లి వద్దకు చేరాడు. అనంతరం తల్లి ఒడిలో నిద్రపోయాడు. అంతలో శ్రావణ్‌కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. తల్లికి ఏమీ జరుగుతుందో తెలియని అయోమయం.
Also read: https://teluguprabha.net/crime-news/minor-girl-harassed-by-old-man-in-chittoor-district/
శోకసంద్రంలో గ్రామం: తన కొడుకు కదలడం లేదని గమనించిన తల్లి బిగ్గరగా కేకలు వేయడంతో… స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, వైద్యులు అతన్ని పరీక్షించి శ్రావణ్ మరణించాడని తెలిపారు. దీంతో తన తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లి దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు.


