సిక్కింలో మంచు భారీగా కురుస్తున్న హిమపాతం ధాటికి ఏడుగురు టూరిస్టులు మృతిచెందారు. గ్యాంగ్ టక్ కు వెళ్లే దారిలో నాథులా పాస్ వద్ద కనీసం 350 మంది టూరిస్టులు ఉన్నారు. వీరిలో చాలా మందిని ఆర్మీ రక్షించగా ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో చిన్న పాప కూడా ఉంది. సుమారు 6 వాహనాల్లో వెళ్తున్న 30 మంది టూరిస్టులు హిమపాతంలో చిక్కుకుపోయారు. వీరికి కూడా సైన్యం అండగా నిలబడి కాపాడింది. కాగా టూరిస్టులు మంచులో చిక్కుకుపోయినవి, ఓ టూరిస్టు మంచులు కూరుకుపోగా మంచు తోడి అతన్ని బయటకు తీసే ఫోటోలు, వీడియోలు భయానకంగా ఉన్నాయి.
Sikkim: హిమపాతంలో చిక్కుకుని ఏడుగురు పర్యాటకులు మృతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES