Sunday, November 10, 2024
Homeనేరాలు-ఘోరాలుStigma killing: పెళ్లి కాకుండా తల్లై..అవమాన భారంతో పురిట్లోనే ..

Stigma killing: పెళ్లి కాకుండా తల్లై..అవమాన భారంతో పురిట్లోనే ..

అప్పుడే పుట్టిన పసిగుడ్డును కిటికీలో నుంచి విసిరేసి చంపేసింది ఓ తల్లి. ఢిల్లీలోని నోయిడాలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఓ 20 ఏళ్ల అమ్మాయి ఈ పని చేసింది. పెళ్లి కాకుండానే తల్లవ్వటంతో బిడ్డను కని అవమాన భారంతో కుమిలిపోయిన ఆమె బాత్రూం కిటికీ నుంచి ఈ పసికందును విసిరేయడంతో బిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రోడ్డు మీద పడి ఉన్న బేబీని ఆసుపత్రికి తీసుకెళ్లిన స్థానికులకు పాప చనిపోయిందని వైద్యులు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తే ఓ ఇంటికి సమీపంలో రక్తపు మరకలు కనిపించగా ఆరా తీశారు. విచారణలో నేరం అంగీకరించిన తల్లి బోరున ఏడ్చింది. ప్రస్తుతం నిందితురాలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News