Student Ends Life at Woxsen University: సంగారెడ్డి జిల్లాలోని వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌కు చెందిన 19 ఏళ్ల రుషికేష్ అనే విద్యార్థి సోమవారం ఉదయం తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని మరణించాడు. హాస్టల్ సిబ్బంది అతడిని స్పృహలేని స్థితిలో చూసిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై మునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రుషికేష్ గదిలో ఉన్న అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు రుషికేష్ సహ విద్యార్థులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడుతున్నారు. కేసు గురించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
రుషికేష్ ఆర్కిటెక్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతడి ఆత్మహత్య ఘటన వోక్సెన్ యూనివర్శిటీ క్యాంపస్‌లో అలజడి రేపింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.


