Suryapet Constable Controversy : సూర్యాపేట జిల్లాలో కానిస్టేబుల్ కృష్ణంరాజు వ్యవహారం సంచలనం రేపింది. నడిగూడెం ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఇతను వరుసగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని, అందులో ఒక బాలికతో ఏడాది క్రితం సూర్యాపేట మండలంలో వివాహం జరిగిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
కృష్ణంరాజు మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడని చైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదు అందడంతో ఎస్పీ నరసింహ విచారణకు ఆదేశించారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డిని విచారణ అధికారిగా నియమించగా, ఆదివారం బాలిక నివాసానికి వెళ్లి కేసు వివరాలు సేకరించారు.
చివ్వెంల మండలానికి చెందిన కృష్ణంరాజు గతంలో తిరుమలగిరి ఠాణాలో పనిచేస్తున్నప్పుడు ఇసుక వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత నడిగూడెం ఠాణాకు బదిలీ అయి, ప్రస్తుతం సూర్యాపేట కలెక్టరేట్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నాడు.
ALSO READ : TG Weather updates: తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. నిన్న హైదరాబాద్‌లో జనజీవనం స్తంభన..!
ఇక ఈ నేపథ్యంలోనే నిత్యపెళ్లి కొడుకుగా మారి ఇప్పటికే 4 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో మైనర్ బాలిక కూడా ఉందంటూ మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కృష్ణంరాజు పరారీ అయినట్లు తెలుస్తుంది. మైనర్‌ను వివాహం చేసుకోవడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదనంగా, బాలికను వేధించిన ఆరోపణలు, ఐదో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం ఉండగా, యూనిఫామ్‌లో రీల్స్ చేసిన వ్యవహారం కూడా వివాదాస్పదమైంది.


