Sunday, September 8, 2024
Homeనేరాలు-ఘోరాలుTanduru: 10 పరీక్ష ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య

Tanduru: 10 పరీక్ష ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య

పదవ తరగతి తెలుగు పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాండూర్ నియోజకవర్గంలో కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం పిన్నెముల గ్రామానికి చెందిన మల్లమ్మ కిష్టప్ప దంపతుల మూడవ కుమారుడు రమేష్ యాలాల మండలంలోని మల్రెడ్డిపల్లి గ్రామంలో నివసిస్తున్న పెద్దమ్మ వద్ద ఉంటూ అగ్గనూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకునే వాడు. తాండూరులోని గౌతమి స్కూల్ పరీక్ష కేంద్రంలో పదవ తరగతి తెలుగు పరీక్ష రాశాక పరీక్షలో ఫెయిల్ అవుతానన్న భయంతో అదే రోజు గ్రామ శివారులో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు.

- Advertisement -

పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్ష కేంద్రంలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారని దీంతో తెలుగు పరీక్ష సక్రమంగా రాయలేనని తోటి స్నేహితులతో చెప్పి బాధపడినట్టు తెలుస్తోంది. అయితే పరీక్ష రాసిన రోజు సాయంత్రం నుండి రమేష్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు యాలల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి తీసుకుని తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News