Sunday, February 8, 2026
Homeనేరాలు-ఘోరాలుTechie Died: అధికారుల నిర్లక్ష్యం.. నీటి గుంతలో పడి టెక్కీ మృతి.. తండ్రి రోదన వర్ణనాతీతం

Techie Died: అధికారుల నిర్లక్ష్యం.. నీటి గుంతలో పడి టెక్కీ మృతి.. తండ్రి రోదన వర్ణనాతీతం

Techien Died in Wa కష్టపడి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడి తండ్రితో పాటు కుటుంబ బరువుబాధ్యతల్లో పాలు పంచుకుంటున్న కుమారుడిని ఉన్నట్టుండి మృత్యువు నీటి గుంత రూపంలో కబళించేసరికి ఆ తండ్రి గుండె విలవిల్లాడిపోయింది. ‘నాకు బతకాలని ఉంది.. నన్ను కాపాడు నాన్నా’ అంటూ కొడుకు చేసిన ఆర్తనాదాలు ఇంకా ఆ కన్నవాళ్ల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. 27 ఏళ్లకే నూరేళ్లు నిండి తమ కళ్లెదుటే ప్రాణాలు విడిచిన చెట్టంత తనయుడి మరణానికి బాధ్యత ఎవరు తీసుకుంటారంటూ వారు విలపించిన తీరు అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. 

- Advertisement -

నోయిడాలో అధికారుల నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. కెరీర్‌పై ఎన్నో ఆశలతో సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి అడుగుపెట్టిన అతడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో పొగ మంచు కారణంగా నీటి గుంతలో కారు పడిపోగా.. అందులో ఉన్న టెక్కీ చావుతో పోరాడి ఓడిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: https://teluguprabha.net/technology-news/new-impetus-for-the-it-sector/ 

బీహార్‌లోని సీతామఢికి చెందిన యువరాజ్ మెహతా, తన కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 150లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా సర్వీస్‌ రోడ్డుపై దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీనికి తోడు రోడ్డుపై ఎలాంటి హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు లేకపోవడంతో… అదుపుతప్పిన అతని కారు పక్కనే నిర్మాణంలో ఉన్న 70 అడుగుల లోతైన, నీటితో నిండిన గుంతలో బోల్తా పడింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన యువరాజ్ వెంటనే తన తండ్రి రాజ్‌కుమార్‌ మెహతాకి ఫోన్ చేశాడు. “నాన్నా, నా కారు నీటి గుంతలో పడిపోయింది. నేను మునిగిపోతున్నా. దయచేసి వచ్చి కాపాడు. చచ్చిపోతానేమో అని భయంగా ఉంది.” అని ఆవేదనతో జరిగింది చెప్పాడు. 

దీంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి.. సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మరోవైపు యువరాజ్‌ కారు నుంచి బయటకు వచ్చి, మునిగిపోతున్న కారు పైకప్పుపై నిలబడి, ఫోన్ టార్చ్ వేసి సహాయం కోసం గట్టిగా అర్థిస్తూనే ఉన్నాడు. 15 నిమిషాల్లోనే పోలీసులు, తండ్రి, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చినా, లోతైన గుంత నుంచి కారును బయటకు తీసేందుకు కావాల్సిన సామగ్రి అందుబాటులో లేవు. 

Also Read: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/young-and-dynamic-ips-officers-appointed-for-ghmc-traffic-solution/

దీంతో స్థానికులు, ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ మోనిందర్‌తో సహా కొందరు ఆ గుంతలోకి దిగి కాపాడేందుకు తమ వంతు కృషి చేశారు. పోలీసులు, డైవర్లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి.. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి కారుతో పాటు యువరాజ్‌ను బయటకు తీశారు. హుటాహుటిన యువరాజ్‌ని ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే అతను ప్రాణాలు విడిచాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

తన కొడుకు ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించాడని.. వాడిని కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించానని విలపించారు. కానీ తమ కళ్ల ముందే కొడుకు చనిపోయాడని రోదిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సర్వీస్ రోడ్డుపై బారికేడ్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదకరమైన గుంతలను మూసివేయాలని గతంలోనే స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపణలు చేశారు.

ఈ దుర్ఘటన తర్వాత స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగడంతో అధికారులు వెంటనే స్పందించారు. ఆ గుంతను చెత్త, శిథిలాలతో పూడ్చివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, అధికారులు నిర్లక్ష్యంగా వహించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News