Road Accident in Rajasthan 18 Died: గత కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ఘోర ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన మరువకముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్‌లో టెంపో అదుపు తప్పి 18 మంది మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆదివారం రాజస్థాన్‌లో ఫలౌదీ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి ఆగి ఉన్న కంటైనర్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దుర్ఘటనలో 18 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న టెంపో వ్యాన్ డ్రైవర్.. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ వాహనాన్ని గుర్తించలేదు. దీంతో కంటైనర్ వెనుక నుంచి టెంపో ట్రావెలర్ బలంగా ఢీకొట్టగా.. టెంపో ట్రావెలర్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో టెంపోలో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
యాక్సిడెంట్ గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
फलोदी जिले में भीषण सड़क हादसा,18 से ज्यादा लोगों की मौत
मतोड़ा थाना क्षेत्र में हुई घटना
टेंपो ट्रैवलर ट्रक में घुसा
बड़ी संख्या में हताहत#jodhpur #accident pic.twitter.com/9bId0IMCvi
— Hemang barua (@BaruaHemang) November 2, 2025


